చింతల అగ్రహారంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Vsp: పెందుర్తి(M) చింతల అగ్రహారం గవరపాలెంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విశేషంగా నిర్వహించారు. ప్రాతఃకాలం స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మహా మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో సువాసనలు విష్ణు సహస్రనామ పారాయణం పఠించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.