పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీఐ
ప్రకాశం: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్‌ను కనిగిరి సీఐ శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సూచనలు ఇచ్చారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.