శ్రీశైలం నీటి నిల్వలు క్షీణతపై ఆందోళన

శ్రీశైలం నీటి నిల్వలు క్షీణతపై ఆందోళన

NDL: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యు‌త్ ఉత్పత్తి, అధిక వినియోగంతో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. గత నెలలో తెలుగు రాష్ట్రాలు 50 టీఎంసీలకుపైగా వినియోగించడంతో నిల్వ 42.93 టీఎంసీలకు పడిపోయింది. గరిష్ఠ మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 822.80 అడుగుల వద్ద ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో డెడ్ స్టోరేజీకి చేరే ప్రమాదం ఉందని అధికారులు చెప్పుకొచ్చారు.