సంగమేశ్వర స్వామి ఉత్సవ వేడుకల్లో డీసీసీ ప్రధాన కార్యదర్శి
SRD: నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంత సమీపంలో ఉన్న చారిత్రాత్మక గట్లళ్ల సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ప్రత్యేక ఉత్సవ వేడుకలు జరిగాయి. మండలంలోని ఆయా గ్రామానికి చెందిన భక్తులు తరలివచ్చి అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా DCC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి కూడా సందర్శించి సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.