పేకాట ఆడుతూ ఏడుగురు అరెస్ట్
KMR: జూదం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7,710 నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు.