బంగారాన్ని కొంటున్న సెంట్రల్ బ్యాంకులు

బంగారాన్ని కొంటున్న సెంట్రల్ బ్యాంకులు

వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీస్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేయడంతో పసిడి ధరలకు రెక్కలొచ్చాయి. సెప్టెంబరులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ అత్యధికంగా 15 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. అలాగే కజకిస్థాన్ 8 టన్నులు, గ్వాటిమాలా 6 టన్నులు, రష్యా 3 టన్నులు, టర్కీ 2 టన్నులు కొనుగోలు చేశాయి. అదే సమయంలో ఉజ్బెకిస్థాన్ మాత్రం 4 టన్నుల బంగారాన్ని విక్రయించింది.