VIDEO: భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

VIDEO: భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

SDPT: కోహెడ మండలం తంగళ్ళపల్లిలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ వేముల వెంకటేశం మాట్లాడుతూ.. తెల్లవారుజామున రథోత్సవం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.