పోలింగ్ సజావుగా జరగాలి: ఎన్నికల అబ్జర్వర్
NRML: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ ఆయేషా మస్రత్ ఖానం (IAS) పోలింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె కుబీర్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా ప్యాక్ చేయాలని ఆదేశించారు.