కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లిలోని శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోమార్గశిర మాసం తొలి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం ప్రతీ గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు.