ట్రాఫిక్ చలానా పేరుతో భారీ మోసం

ట్రాఫిక్ చలానా పేరుతో భారీ మోసం

GNTR: ట్రాఫిక్ చలానా పేరుతో కేటుగాళ్లు రూ.1.36లక్షలు కాజేశారు. దుగ్గిరాల(M) వీర్లపాలెంకు చెందిన ఆళ్ల నిరంజన్ రెడ్డికి ట్రాఫిక్ చలానా పేరుతో వాట్సాప్‌లో ఓ లింక్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయగానే క్రెడిట్ కార్డు నుంచి పలు దఫాలుగా రూ.61వేలు, రూ.32వేలు, రూ.20వేలతో ఆన్‌లైన్‌లో ఫోన్లు కొనుగోలు చేసినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.