నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా హోలీ సంబరాలు

నిర్మల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా హోలీ సంబరాలు

NRML: నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో హోలీ సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జర్నలిస్టులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కోరారు.