కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. అభివృద్ధి: పొంగులేటి
TG: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్ నగర్‌లో పర్యటించిన మంత్రి.. పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో BRS మౌలిక వసతులు కల్పించలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే.. మూడేళ్లలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.