కళాశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కళాశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: ప్రతి విద్యార్ధి పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన సూచించారు. మంగళవారం ఆయన స్దానిక బూసాయవలస కస్తూర్భా పాఠశాలలో రూ. 1.60కోట్లతో నిర్మించిన ఇంటర్‌ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.