అందరం కులమతాలకు అతీతంగా ఉండాలి: ఎమ్మెల్యే
PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శనివారం గోదావరిఖని శారద్‌నగర్, రామగుండం, 4 ఇంక్లైన్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అందరం కులమతాలకు అతీతంగా కట్టుగా ఉండాలని సూచించారు. గోదావరిఖని షాదీ ఖానాకు 2008లో 18 గుంటల భూమి శాంక్షన్ చేసి రూ.46 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ స్వామి పాల్గొన్నారు.