ప్రధాని మోదీతో రక్షణ శాఖ మంత్రి భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మోదీకి 'ఆపరేషన్ సింధూర్' గురించి వివరిస్తున్నారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా, ఆపరేషన్ సింధూర్‌ను మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.