'తనను వేధింపులకు గురిచేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు'

కోనసీమ: అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కొందరు వైద్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ స్టాఫ్ నర్స్ సతీ సుమతి మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి అమలాపురంలోని మంత్రి నివాసం వద్ద ఆయనను కలిసి తన ఆవేదనను చెప్పుకుంది. 2024లో జరిగిన ఒక దొంగతనంలో ఒక వ్యక్తి ని పట్టుకోవడంతో తనను వేధింపులు మొదలయ్యాయని సుమతి తెలిపారు.