హవాలా నగదు తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
NTR: గుణదలలో భారీగా హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఒడిశా నుంచి విజయవాడకు తరలిస్తున్న రూ.2 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుజరాత్ కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామన్నారు. అనంతరం నిందితులను ఐటీ అధికారలుకు అప్పగించినట్లు వారు వెల్లడించారు. కాగా, వీటిని ఎక్కడికి తరలిస్తు్న్నారు అనే కోణంటో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.