నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు
NLG: ఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ఇవాళ చౌటుప్పల్ మండలం పంతంగి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభం కానున్నాయి. MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, MLC నెల్లికంటి సత్యం ముఖ్య అతిధులుగా హాజరై, ప్రారంభించనున్నారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ పోటీల్లో 10 జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.