వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు: ఈవో

TPT: శ్రీకాళహస్తి మండల పరిధిలోని ఊరందూరు గ్రామంలో గల శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మే 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవో బాపిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.