'విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించండి'
KDP: నగరంలో వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న, వంగిన విద్యుత్ స్తంభాలను తక్షణమే విద్యుత్ అధికార యంత్రాంగం పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని సీపీఎం నగర కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. ఇవాళ నగరంలోని సాయిపేట, రూకవారిపల్లె ప్రాంతాల్లో సీపీఎం ప్రతినిధి బృందం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పర్యటన నిర్వహించారు.