సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థుల ఆందోళన
MBNR: జిల్లా కేంద్రం నుంచి వేపూరు, మునిమోక్షం మీదుగా కోతలాబాద్ వెళ్లేందుకు బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు బుధవారం రాత్రి ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదన్నారు.