విద్యుత్ షాక్‌తో రైతు మృతి

శ్రీకాకుళం: పలాస(M) గోపాలపురం గ్రామానికి చెందిన రైతు యవ్వారి వైకుంఠరావు విద్యుత్ షాక్‌తో గురువారం మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీరు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లిన వైకుంఠరావు చీకటి పడినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.