VIDEO: 'ఎరువుల కొరతపై ప్రత్యేక దృష్టి సారిస్తా'

SKLM: ప్రస్తుత వ్యవసాయ సాగులో భాగంగా ఎరువులు కొరత ఉన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం సారవకోట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎరువుల కొరత తీర్చే విధంగా కొత్తగా నానో ఎరువు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని దానిని వినియోగించుకోవాలని అన్నారు.