నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

W.G: దేవాలయ నూతన పాలకవర్గ సభ్యులు భక్తులకు మెరుగైన సేవలను అందించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం శ్రీభీమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్మన్‌గా గనిరెడ్డి త్రినాథ్, ధర్మకర్తల సభ్యులచే ఆలయ ఈవో తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు.