ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తయ్యేలా చూడాలి
JGL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అడిషనల్ డీఆర్డీవో, జగిత్యాల నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల నోడల్ ఆఫీసర్ మదన్మోహన్ అన్నారు. బీర్పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, క్లస్టర్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.