కడుపులో మంట, అజీర్ణం సమస్య వేధిస్తోందా?
ఆహారం కొద్దిగా అటు ఇటు అయినా వెంటనే కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇలాంటప్పుడు చల్లని పాలు తాగడం వల్ల అన్నవాహికలో ఏర్పడిన మంట తక్షణ ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది. కొద్దిగా తులసి ఆకులను నమలడం లేదా వాటి రసాన్ని తాగడం వల్ల కడుపులో శ్లేష్మం ఉత్పత్తి పెరిగి, అదనపు ఆమ్లాల నుంచి కడుపులో మంటను తగ్గిస్తుంది.