రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం

HYD: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని జాతీయ రహదారిపై నందికంది శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందారు. సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ కార్వాన్‌కు చెందిన బెల్సారి మంగళ(51) కొడుకు గిరధర్‌తో కలిసి బైక్‌పై ఝరాసంఘం వెళ్లి తిరుగు పయనమయ్యారు. నందికంది వద్ద ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి పడిపోయారు.