వేప చెట్లకు వైరస్..!
VKB: సర్వరోగ నివారిణిగా పిలిచే వేప చెట్లను పరిగి పట్టణంలో వైరస్ పట్టి పీడిస్తోంది. శీతాకాలం ఆరంభంలో పచ్చగా ఉండాల్సిన చెట్ల ఆకులు, కాలినట్లుగా మారి ఎండిపోయి క్రమంగా మోడువారుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ఈ వైరస్ సోకడం ఇది మూడోసారి అని స్థానికులు తెలిపారు. దీనిపై అటవీ, ఉద్యానవన శాఖ అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.