VIDEO: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

VIDEO: అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ అభివృద్దికి నిరంతరం శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని ఎమ్మెల్యే రాము వెనిగండ్ల పేర్కొన్నారు. నందివాడ మండలం పుట్టగుంట సచివాలయంలో బుధవారం ఎమ్మెల్యే రాము 'ప్రజా దర్బార్' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ సమస్యలపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.