అనిల్ రావిపూడి మూవీలో కృతిశెట్టి?

అనిల్ రావిపూడి మూవీలో కృతిశెట్టి?

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన కాస్టింగ్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం కీర్తి సురేష్‌‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తాజాగా మరో ముఖ్యమైన పాత్ర కోసం 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.