ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహిళా ఓటర్లు

ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహిళా ఓటర్లు

MNCL: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశారు. హాజీపూర్ మండలంలో 306 మంది, లక్సెట్టిపేటలో 847, దండేపల్లిలో 1,375, జన్నారంలో 2,767మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఓటు వేశారు. మొత్తంగా పురుషులకన్నా 5,295 మంది మహిళలు ఎక్కువ ఓటు వేశారు. ఈ క్రమంలో ఫలితాల్లో కీలకంగా వ్యవహరించారు.