నేడు చెన్నైలో ప్రధాని ఎన్నికల ప్రచారం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ చెన్నైలో పర్యటించనున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఆయన, మైలాపూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే అగ్రనేతలతో భేటీ అయ్యి ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరపనున్నారు. ఈనెల 23న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో PM పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.