'జోగి రమేష్ అరెస్టు అక్రమం'
ELR: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్య అని వైసీపీ పోలవరం నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తోట జయబాబు ఆదివారం మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా, కూటమి నేతల ప్రేరణతో అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. వైసీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోందన్నారు.