VIDEO: అయినవిల్లి మండలంలో భానుడి భగభగ

VIDEO: అయినవిల్లి మండలంలో భానుడి భగభగ

E.G: అయినవిల్లి మండలంలో గురువారం 40 డిగ్రీల ఎండ తాపం ఉండటంతో మండలంతా కర్ఫ్యూ వాతావరణం తలపిస్తుంది. తట్టుకోలేనంత ఎండల వేడిమి ఉండటంతో ప్రజలంతా గృహాలకే పరిమితమవుతున్నారు. ఎండకు తట్టుకునే ధైర్యం లేక ప్రజలు, వాహనదారులు పనులు మానుకుని ఇళ్ళ వద్ద సేదతీరాల్సి వస్తుంది. తిరిగి సాయంత్రం ఐదు గంటలు దాటాక గాని బయటికి రాలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు.