సోమందేపల్లిలో వాడుకలో రాని ఆర్టీసీ బస్టాండ్
సత్యసాయి: సోమందేపల్లిలో ఆర్టీసీ బస్టాండు వాడుకలోకి రాక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గతంలో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ప్రారంభించిన ఈ ఆర్టీసీ బస్టాండు ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. గతంలో అధికారులు బస్టాండుకు పెయింట్ వేసి వదిలేశారు. ప్రస్తుతం పెద్దమ్మగుడి వద్ద బస్సులు ఆపుతుండడంతో ప్రజలు అక్కడే బస్సులు ఎక్కాల్సి వస్తుంది.