అమరాపురం మండలంలో వైసీపీకి షాక్
SS: మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం చేరికల కార్యక్రమం జరిగింది. అమరాపురం మండలం కె.శివరం పంచాయతీ నుంచి వైసీపీ నాయకులు ముద్దన్న, తిమ్మన్న, వీరభద్రప్ప సహా 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.