తూము లీకేజీతో సాగునీరు వృథా
TPT: ఎర్ర చెరువు తూము లీకేజీ కారణంగా సాగునీరు వృథాగా పోతోంది. మరమ్మతుల సమస్యలతో చెరువులోని నీరు బీడు భూములు, నారుమడులపై వరదలా ప్రవహిస్తోంది. వారంలో వరి నాట్లు వేయాల్సిన రైతులు నారుమడులు నీట మునిగిపోవడంతో పాడైపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూము లీకేజీని వెంటనే అరికట్టాలని ఇరిగేషన్ అధికారులను రైతులు కోరుతున్నారు.