మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: నేడు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సుభాష్ పర్యటన వివరాలను ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేటి ఉదయం 11 గంటలకు అమలాపురంలో వాసర్ల గార్డెన్స్‌లో వడ్రంగి యూనియన్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు రామచంద్రపురం రూరల్ మండలం తాళ్లపాలెం, ఉట్రుమిల్లి గ్రామలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.