VIDEO: వింత ఘటన.. పిల్లి పిల్లను సాకుతున్న కోతి
కాకినాడ రూరల్ తూరంగిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కోతి గత మూడు రోజులుగా పిల్లి పిల్లను తన బిడ్డలా సాకుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోమవారం కూడా ఆ పిల్లి పిల్లను గుండెలకు హత్తుకుని, ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్తూ మురిసిపోతోంది. బద్ధ శత్రువులైన ఈ రెండింటి మధ్య ప్రేమానురాగాలను చూసి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.