సోమశిల-శ్రీశైలం లాంచీ సర్వీసులు మళ్లీ ప్రారంభం

సోమశిల-శ్రీశైలం లాంచీ సర్వీసులు మళ్లీ ప్రారంభం

TG: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రవాహం తగ్గడంతో పర్యాటక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. 120 మంది ప్రయాణించే AC డబుల్ డెక్కర్ లాంచీని సిద్ధం చేశారు. ఈ ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర పెద్దలకు రూ.2000, పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు. ఈ ప్రయాణం దాదాపు 7 గంటలు పడుతుంది.