పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
VZM: చీపురుపల్లి మండలం అలజంగి గ్రామంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రూ.3.11 లక్షలతో ఆర్&బీ రోడ్డు పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అలజంగి, పేరిపి, ఇటకర్లపల్లి, గొల్లములగాం, చిన్ననడిపల్లి గ్రామాలు కలుపుకొని 10 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.