విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

HNK: దామెర మండలంలో విషాదం చోటుచేసుకుంది. ఊరుగొండ గ్రామానికి చీలిక దామోదర్ (43) అనే రైతు ఇవాళ ఉదయం మొక్కజొన్న పంటకు నీరు పెట్టిన సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.