నేటి నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ

W.G: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులోని 7 రకాల సేవలకు సంబంధించి బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని జేసీ రాహుల్ కుమార్ మంగళవారం తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల తొలగింపు, చేర్పు, కార్డు సరెండర్, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్‌లో దిద్దుబాట్లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.