కనకదుర్గమ్మను దర్శించుకున్న విదేశీ భక్తులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న విదేశీ భక్తులు

NTR: విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన విదేశీయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, వేద పండితుల చేత ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించిన విదేశీ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈవో శీనా నాయక్ చేపడుతున్న సేవలను వారు అభినందించారు.