'హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలి'

'హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలి'

ASR: గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు రద్దు చేయాలని అరకు మండలం బస్కి పంచాయతీ అఖిలపక్ష నేతలు కోరారు. ఈ మేరకు శుక్రవారం అరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను కలిసి వినతిపత్రం అందజేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై గిరిజనుల వ్యతిరేకతను కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే అన్నారు.