అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీ బిడ్డ క్షేమం
MBNR: భూత్పూరు మండలంలోని నక్కలబండ తండాకు చెందిన గర్భిణి విజయ (22)ను ఆదివారం 108 వాహనంలో ఆసుపత్రికి మార్గం మధ్యలోనే ప్రసవమైంది. ఈ క్రమంలో ఈఎంటీ లక్ష్మీదేవి, పైలెట్ శ్రీనివాస్ అప్రమత్తమై సుఖ ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. అనంతరం వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.