ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ అనుమానంతో కలకలం
సత్యసాయి: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్క్రబ్ టైఫస్ అనుమానంతో కలకలం నెలకొంది. చిలమత్తూరు మండలం వడ్డిపల్లికి చెందిన రెండేళ్ల బాలుడిని తీవ్రమైన జ్వరంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. లక్షణాలు స్క్రబ్ టైఫస్‌లా ఉండడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ రిపోర్టు తర్వాత స్పష్టత వస్తుందని చెప్పారు. ఆందోళన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.