100 మంది లబ్ధిదారులకు ఆటో-రిక్షాల పంపిణీ

100 మంది లబ్ధిదారులకు ఆటో-రిక్షాల పంపిణీ

సత్యసాయి: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన సత్యసాయి జీవన ఉపాధి కార్యక్రమంలో 100 మంది లబ్ధిదారులకు ఆటో-రిక్షాలను పంపిణీ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఒడిశా గవర్నర్ హరిబాబు, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు ఈ ఆటోలను అందజేశారు.