రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
MDK: పాపన్నపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. యూసుఫ్పేటకు చెందిన తుడం నాని(22) తన స్నేహితుడు చిన్నతో కలిసి బైక్‌పై అర్కేల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో నానికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.