ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ

PPM: కొమరాడ మండలంలోని కెమిశీల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను జాయింట్ కలెక్టర్ సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు కలెక్టర్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.